29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

రైతును రాజు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం

Must read

📰 Generate e-Paper Clip

  • కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి,సంక్షేమం
  • ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి

 

 నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  తెలంగాణ రాష్ట్రంలో రైతులను రాజు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. డిచ్పల్లి మండలంలోని  బర్దిపూర్ ధర్మారం  నడిపల్లి గ్రామాలలో  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించారు.శనివారం రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వ్యవసాయం దండగ, సన్న వడ్లను వేయరాదని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతులు అభివృద్ధి చేసి, రైతును రాజు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. డిచ్పల్లి  మండలం రాంపూర్ గ్రామంలో  శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రారంభించారు. రాంపూర్ గ్రామానికి ఇప్పటివరకు 12 కోట్ల నిధులు కేటాయించానని, పనులు కూడా చివరి దశలో  అన్న గుర్తు చేశారు. ఆరేపల్లి గ్రామంలో  అంగన్వాడి భవననికి శంకుస్థాపన చేసి, బీటీ రోడ్డుకు  శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలు లోనే మహిళలకు వడ్డీ లేని రుణాలు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రేషన్ కార్డులు ఉచిత సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరా శక్తి క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, బస్సులు, వంటివి ఇచ్చామని అన్నారు. మహిళా సంఘాలు సిండికేట్ గా ఏర్పడి బస్సులను కొని ఆర్టీసీకి అద్దెకి ఇస్తే, నెల నెల డబ్బులు వస్తాయని ఆయన అన్నారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ వంటి సంక్షేమ పథకాలను  అమలు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు  కాంగ్రెస్ వైపే చూస్తున్నారని అన్నారు. మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో  బిజెపి టిఆర్ఎస్ రెండు కలిసి పని చేశాయని, కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి కుట్ర పన్నాయని అన్నారు. ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపే ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించారాని అన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సర్పంచులుగా, ఎంపిటిసిగా,జడ్పీటీసీగా గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించిన అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులను, సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేయడం జరిగింది. అలాగే బర్దిపూర్ ధర్మారం నడిపల్లి గ్రామాలకు  ఆరోగ్య సబ్ సెంటర్లు ఉండడంవల్ల  గర్భిణీలకు, వృద్ధులకు, రోగగ్రస్తులకు వెనువెంటనే చికిత్స ఉంటుందని తెలిపారు. సరైన సమయంలో  వైద్యం అందుతుందని, అలాగే ఇక్కడ ఆధునిక సదుపాయాలతో పాటు ల్యాబ్ కూడా ఉందని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ కి  పరిమితం అయిందని, కేటీఆర్ ను త్వరలో జైలుకు పంపడం ఖాయమని అన్నారు. కెసిఆర్ వారి కుటుంబం తెలంగాణను  ఒకటి దొంగల దోచుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలసాని శ్రీనివాస్, అమృతపూర్ గంగాధర్, కంచెటి  గంగాధర్, సామ్ సన్, వాసు బాబు, ఈగ నారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, భాస్కర్,సొసైటీ చైర్మన్లు డైరెక్టర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

The Congress government has made the farmer a king.

More articles

Latest article