27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

లా అండ్ ఆర్డర్ కాపాడలేని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహాన్ని ద్వాంసం చేసిన సంఘటన పై అర్బన్ ఎమ్మెల్యే స్పందిస్తూ హిందువులు భక్తి శ్రద్దలతో కోలుచుకునే ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సలీమ్ సల్మాన్ , వాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన జాకిర్ నాయక్ లపై చర్య తీసుకోకుండా, శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న హిందువులపై అమానుషంగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎం ఐ ఎం పార్టీ నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారిన నయా నిజాం రేవంత్ ముఖ్యమంత్రి బాధ్యతలు మరచి ప్రవర్తిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లా అంద్ ఆర్డర్ పూర్తిగా అదుపుతప్పిందని ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలనను గుర్తు తెచ్చే విదంగా రేవంత్ పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడలేని ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేసారు. హిందూ దేవి, దేవతల పైన దాడులు చేస్తున్న దోషులు ఎంతటివారినైనా కఠినంగా శిక్షించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. లేదంటే 80% ఉన్న హిందువుల ఓపిక, సహనాన్ని పరీక్షిస్తే తరువాత జరిగే పరిణామలకు ఈ సర్కారే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

More articles

Latest article