25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కాంగ్రెస్ లో చేరిన జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు గంపల వెంకయ్య

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నాగిరెడ్డిపేట్ : మండలంలోని చీనూరు గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకుడు, బిజెపి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు గంపల వెంకయ్య శనివారం బిజెపి పార్టీకి రాజీనామా చేసి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గంపల వెంకయ్యకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంపల వెంకయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు విట్టల్ రెడ్డి, రామచంద్ర రెడ్డి, మురళి గౌడ్, కిష్టయ్య, కొండ కృష్ణ తదితరులు ఉన్నారు.

District OBC Vice President Gampala Venkaiah joined the Congress

More articles

Latest article