26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఒకే గ్రామంలో 40 ఇండ్లు ప్రారంభం

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

భిక్కనూరు మండలంలోని  ర్యాగట్లపల్లి గ్రామంలో 40 ఇండ్లను కామారెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లు లేని నిరుపేదలకు పక్కా గృహాలను అందించి, వారి ముఖాల్లో చిరునవ్వు చూడటమే ఈ కార్యక్రమ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వో సునీత, ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, జిల్లా కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్, గ్రామ సర్పంచ్ గ్రామ కార్యదర్శి, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

More articles

Latest article