26.3 C
Hyderabad

సన్నబియ్యంలో కేంద్రానికిదే అధిక వాటా

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో కేంద్ర ప్రభుత్వానిదే అధిక వాటా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. రాష్ర్టంలోని 96లక్షల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5కిలోల బియ్యాన్ని కేంద్రం ఉచితంగా అందిస్తోందని, హమాలీ, గోడౌన్, సెస్ అన్ని ఖర్చులు కలుపుకుని ఒక్క కేజీ బియ్యంపై సుమారు రూ.38 కేంద్రం భరిస్తోందని వివరించారు.

తెలంగాణ రాష్ర్టానికి రూ.5,800 కోట్లు నేరుగా కేంద్రమే చెల్లిస్తోందన్నారు. నగరంలోని నాందెవ్ వాడ లో ఉన్న 21వ నంబర్ రేషన్ షాపులో లబ్ధిదారులకు ఆయన సన్నబియ్యం పంపిణీ చేశారు. రాష్ట్రంలో  సుమారు 30 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్లకి గౌరవ వేతనం, కమిషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ బాలరాజు, బీజేపీ నాయకులు మాస్టర్ శంకర్సుధీర్ సంజయ్ పురోహిత్, అక్షయ్ అఖిల్తదితరులు పాల్గొన్నారు.

The Centre has the largest share in rice.

More articles

Latest article