సన్నబియ్యంలో కేంద్రానికిదే అధిక వాటా
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో కేంద్ర ప్రభుత్వానిదే అధిక వాటా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. రాష్ర్టంలోని 96లక్షల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5కిలోల బియ్యాన్ని కేంద్రం ఉచితంగా అందిస్తోందని, హమాలీ, గోడౌన్, సెస్ అన్ని ఖర్చులు కలుపుకుని ఒక్క కేజీ బియ్యంపై సుమారు రూ.38 కేంద్రం భరిస్తోందని వివరించారు. తెలంగాణ రాష్ర్టానికి రూ.5,800 కోట్లు నేరుగా కేంద్రమే చెల్లిస్తోందన్నారు. నగరంలోని నాందెవ్ వాడ లో ఉన్న 21వ నంబర్ రేషన్ షాపులో...