28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి

Must read

📰 Generate e-Paper Clip

  • అసెంబ్లీ తీర్మానాన్ని పార్లమెంట్ చట్టం చేయాలి
  • సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు అన్నారు. నగరంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు కోసం తెచ్చిన జీవో నెంబర్ 9, స్థానిక ఎన్నికలను నిలుపుదల చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్  కు ప్రధానంగా బిజెపి వైఖరి కారణమని అన్నారు. గత ఫిబ్రవరిలో రాష్ట్ర అసెంబ్లీలో  42%  బిసి రిజర్వేషన్లు అమలు జరపాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలను సర్వే చేసి నిర్ణయించి దానికి అనుగుణంగా రిజర్వేషన్లను నిర్ణయించడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తమ రాజకీయ విధానంలో భాగంగా బిజెపి ఇతర ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో వారు నిర్ణయాలను అమలు జరపటంలో నిర్లక్ష్యం వహించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదం పొందకుండా కాలయాపన చేస్తూ తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా 50% రిజర్వేషన్ల కోటాను ఎత్తివేస్తూ అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్ర గవర్నర్కు పంపిన దాన్ని కూడా ఆమోదింప చేయకుండా తెలంగాణ పట్ల బిజెపి కక్ష సాధిస్తుందని అన్నారు. ఈ రాష్ట్రం నుండి ప్రధానంగా నిజాంబాద్ జిల్లా నుండి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గాని కేంద్ర మంత్రులుగా ఉన్న జి కిషన్ రెడ్డి గానీ, బండి సంజయ్ గాని ప్రభుత్వాన్ని ఒప్పించి బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదింప చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టటమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఇది పూర్తిగా ద్వంద వైఖరిని తెలియజేస్తుందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్ర ప్రజల కోరిక అయినటువంటి రిజర్వేషన్ల అమలును జరిగేటట్టు చూడాలని లేనియెడల బిజెపికి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు. మెజార్టీ ప్రజల అభిప్రాయానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించటం సరైనది కాదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article