. . . టీయుసిఐ రాష్ట్ర అధ్యక్షులు కే.సూర్యం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అసంఘటిత రంగ కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, కోప్టా చట్టంతో బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తుందని టీయుసీఐ రాష్ట్ర అధ్యక్షులు కే.సూర్యం అన్నారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లిలోని జిల్లా పద్మశాలి సంఘం భవనంలో ఆదివారం జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపకుండా, వారి ఉపాధిని దెబ్బతీయడం దుర్మార్గమన్నారు. బీడీ కార్మికులకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీరేట్ల పెంపు లేకపోవడంతో, బీడీ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు అర్హులైన బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీడీ కార్మికుల కూలీరెట్ల పెంపు, గౌరవప్రదమైన పెన్షన్, మెరుగైన జీవితం కోసం, ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు మరింత చైతన్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరేందర్, యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.రాజేశ్వర్, ఎం వెంకన్న, జిల్లా అధ్యక్షులు బి.మల్లేష్, సహాయ కార్యదర్శి డి.కిషన్, సాయరెడ్డి, లాలయ్య, నాయకులు లింగం, కిరణ్, రవి, నాగమణి, శ్రీనివాస్, సునీత, లక్ష్మీ, అజ్మీరా, సత్యగంగు, భాగ్యలక్ష్మి, అనురాధ, నిర్మల, రేవతి, సూర్యకళ, మంజుల తదితరులు పాల్గొన్నారు.
