22.7 C
Hyderabad

వడ్లు కుప్పలు కుప్పలుగా ఉండిపోయాయి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

హమాలీలు రాక తూకాలు వేయకపోవడంతో ఎక్కడికక్కడ వడ్లు కుప్పలు కుప్పలుగా ఉండిపోయాయని కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలంలోని కల్లెడి, కల్లడి తాండ వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన ఆదివారం పరిశీలించారు. 25 రోజులు నుంచి వడ్లు మ్యాచర్ వచ్చాయని, కానీ హమాలీలు లేక తూకాలు వేయట్లేదని ఆయనన్నారు. అనంతరం అధికారులతో మాట్లాడగా, 30 మంది హమాలీ లను తీసుకువచ్చి, రేపటి నుంచి తూకాలు స్టార్ట్ చేస్తామని అధికారులు అన్నారని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడాతమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కల్లెడి సర్పంచ్ భర్త ప్రళయ్ తేజ్, రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article