25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్రం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : కేంద్రం లో ఉన్న బిజెపి ప్రభుత్వంl కార్మిక వ్యతిరేకవిధానాలను అవలంభిస్తోందని, కార్మిక వర్గాల వ్యతిరేక చట్టలను తెస్తోందని తెలంగాణ బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిద్ది రాములు అన్నారు. సోమవారం తెలంగాణ బీడీ యజమాన్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేందర్ గాంధీకి సమ్మె నోటీసును అందజేసిన సందర్బంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూలై 9,న  జరిగే జాతీయ సమ్మె లో తెలంగాణ రాష్ట్రములోని బీడీ పరిశ్రమ లో పనిచేయు బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చటన్ నెలసరి ఉద్యోగులు,టేకేదార్లు అందరూ అధిక సంఖ్యలో సమ్మెలో  పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జూలై 9,న బీడీ పరిశ్రమ బంద్ పాటించాలని అన్నారు. బీడీ పరిశ్రమ ప్తె,ఆంక్షలు ఎత్తి వేయాలని, జి,యస్, టీ,ని తొలగించాలని, కొఫ్టా చట్టం ను రద్దు చేయాలని,బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అందరికి కేంద్ర ప్రభుత్వం రూ.10,వేల జీవన భృతి ఇవ్వాలని,రిట్తెడ్ అయిన  బీడి కార్మికులకు రూ.9000పెన్షన్ ఇవ్వాలని, నాలుగు కోడ్లను రద్దు చేయాలని,  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సందర్బంగా బీడీ కార్మికులకు ఇచ్చి హమీ ప్రకారంv2014, పిబ్రవరి 28bకటాప్ తధిని తోలగించి ఎలాంటీ షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి రూ. 4016 ల జీవన భృతి ఇవ్వాలని,తదితర డిమాండ్ల సాదనక్తె జూలై,9,న జరిగే సమ్మె ను జయప్రదం చేయాలని, కార్మిక వర్గానికి కు ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం (బిఎల్ టీయూ)రాష్ట్ర కోశా ధికారి యస్, డి,స్తెయ్యద్ పలువురు పాల్గొన్నారు.

More articles

Latest article