కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్రం
నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : కేంద్రం లో ఉన్న బిజెపి ప్రభుత్వంl కార్మిక వ్యతిరేకవిధానాలను అవలంభిస్తోందని, కార్మిక వర్గాల వ్యతిరేక చట్టలను తెస్తోందని తెలంగాణ బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిద్ది రాములు అన్నారు. సోమవారం తెలంగాణ బీడీ యజమాన్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేందర్ గాంధీకి సమ్మె నోటీసును అందజేసిన సందర్బంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూలై 9,న జరిగే జాతీయ సమ్మె లో తెలంగాణ రాష్ట్రములోని బీడీ పరిశ్రమ లో పనిచేయు బీడీ కార్మికులు, ప్యాకర్లు,...