25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

అహంభావి అరవింద్ కు కేసీఆర్ ను విమర్శించే అర్హత లేదు

Must read

📰 Generate e-Paper Clip

  • మోడీ మొఖం చూపి గెలిచిన యాక్సిడెంటల్ ఎంపి.అరవింద్
  • సింహం లాంటి కేసీఆర్ పై గాడిదలాగ గాండ్రిపు చెల్లునా
  • మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎం.పీ అరవింద్ అహంభవి అని, ఆయనకు కేసీఆర్ ను విమర్శించే అర్హతలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం మీడియా సమావేశంలో  ఎం. పీ అరవింద్ కేసీఆర్ ను కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూvగత ఐదు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉండి,చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తిని విమర్శించడానికి ఎంపీ అరవింద్‌ కు ఏమాత్రం అర్హత, స్థాయి లేదన్నారు. తండ్రి వయసున్న  కేసీఆర్ పై తెలంగాణ ఉద్యమకారులైన కేటీఆర్,హరీష్ రావు, కవితల పై వ్యక్తిగత హననం చేస్తూ అరవింద్ మాట్లాడిన మాటలు ఆయన దిగజారుడు స్థాయిని సూచిస్తున్నాయన్నారు. సింహం లాంటి కేసీఆర్ పై గాడిద లాగ గాండ్రిస్తున్న అరవింద్  అహంకారానికి ప్రజలు తొందరలోనే పాతరేస్తారని, 71 ఏండ్లు ఉన్న కేసీఆర్ ముసలోడైతే, 74 ఏండ్లు ఉన్న మోడీ అయిషోడా అని ఆయన ప్రశ్నించాడు. అరవింద్ తండ్రి  డి.శ్రీనివాస్ రాజకీయంగా సమాధి అనుకున్న సమయంలో  మళ్లీ ఎంపీ ని చేసి వెలుగులోకి తెచ్చింది కేసీఆరే నని గుర్తు చేశారు. నీ మొఖానికి  ఎవరు ఓట్లు వేయరని “నన్ను చూసి కాదు మోడీ ని చూసి బిజెపి కి ఓట్లు వేయండి”  అని అడుక్కొని యాక్సిడెంటల్ ఎంపీ అయ్యావని ఆయన ఏద్దేవా చేశారు. రెండుసార్లు ఎంపీగా గెలిచినప్పటికీ, జిల్లాకు,నియోజకవర్గ ప్రజలకు అందించిన అభివృద్ధి శూన్యమని, ఎప్పుడు ఇతరులపై  మతి లేని మాటలు,బూతులు మాట్లాడుతూ తన వైఫల్యాలను   కప్పిపుచ్చుకునే  ప్రయత్నం  చేస్తాడని అన్నారు. ఒక్క అంశంపై కూడా సరైన అవగాహన లేమితో.అడ్డగోలుగా ఒర్రడం తప్ప ఆయనకు తెలిసిందేమి లేదన్నారు. ‘బనకచర్ల’ను ‘జనకచర్ల’ అని మాట్లాడిన అరవింద్ మాటలు ఇరిగేషన్ పై అవగాహన లేక మాట్లాడరని,ఆయన విషయ అవగాహన స్థాయి ని ప్రజలకు అర్థమయ్యేలా చేసాయి అని అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై మాట్లాడకుండా ఇంకా బీఆర్ఎస్ పార్టీపై నిత్యం విమర్శలు చేయడం ద్వారా బీజేపీ – కాంగ్రెస్ పార్టీ లు ఒకటే అని ప్రజలు గుర్తిస్తున్నారని, రేవంత్ రెడ్డి ద్వారా వ్యక్తిగత లబ్ధి పొందటం కోసమే బీజేపీ ఎంపీ లు ఇంకా బీయర్ యస్ పై విమర్శలు చేస్తున్నారన్నారని ఆయన నిప్పులు చేరిగారు. బీయర్ యస్ పార్టీ తెలంగాణ ప్రజల హక్కుల కోసం,కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం నిత్యం పోరాడుతుంటే, బీజేపీ ఎంపీలు మాత్రం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణకు చేస్తున్న అన్యాయంపై ఓ మాట కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నారని అన్నారు. అనేక అంశాల్లో మీ పార్టీ లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ముందు వాటిని సక్కదిద్దుకో ఆ తర్వాత ఇంకొరి మీద ఏడువాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు.ఆధికార మధం తో, అహంభావంతో విర్రవీగుతున్న నిన్ను ప్రజలు గమనిస్తున్నారని,సమయం వచ్చినప్పుడు ప్రజలే నీలాంటి వాళ్లను రాజకీయంగా పాతాలానికి తొక్కుతారని ఆయన మండిపడ్డారు.

More articles

Latest article