ఇళ్ల స్థలాల హద్దులు చూపెట్టాలి
బోధన్ సబ్ కలెక్టర్ కు సీపీఎం వినతి బోధన్ , బతుకమ్మ : చందూర్ మండల కేంద్రంలోని మర్రి బొగడ కాలోనిలోని ఇందిరమ్మ ఇళ్లకు హద్దులు చూపెట్టాలని సీసీఎం ఆధ్వర్యంలో బుధవారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోకు వినతి ప్రతం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ మాట్లాడారు. ప్రభుత్వం హద్దులు చూపెట్టకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే హద్దులు చూపిస్తే నిర్మించుకుంటామని కోరారు. సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారని సమస్య పరిష్కారం కొరకు ఆదేశాలు ఇస్తామని చెప్పారన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ...