30.9 C
Hyderabad
Monday, August 3, 2026

నువ్వా.. నేనా అన్న చందంగా మారిన అధికారుల తీరు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇద్దరు అధికారుల మధ్య వాగ్వివాదం

 

రుద్రూర్, బతుకమ్మ :

 

తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి, పక్షపాతం లేదా అధికారుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా పరిపాలన ‘నువ్వా నేనా’ అన్నట్లుగా మారడం సర్వసాధారణంగా మారింది. రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నువ్వా.. నేనా అన్న చందంగా మారింది ఓ ఇద్దరు అధికారుల తీరు.  రాజకీయ జోక్యం, సిబ్బంది కొరత, పారదర్శకత లోపించడం వల్ల సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓ రెవెన్యూ అధికారి హోదాలో ఉండి కూడా ఓ రాజకీయ నాయకుడికి సపోర్ట్ చేస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఆ రాజకీయ నాయకునిది ఏదైనా పని ఉంటే సాధారణ వారి పనులను పక్కన పెట్టి ఆ నాయకుని పని మాత్రమే చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఆ రెవెన్యూ అధికారి పని తీరుపై పలుమార్లు ఆరోపణలు వెలువెత్తాయి. అయినా కూడా ఆ అధికారి తీరు మార్చుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తహసిల్దార్ కార్యాలయంలో ఆ ఇద్దరు అధికారుల మధ్య వాగ్వివాదం సద్దు మనుగుతుందా లేదా అని వేచి చూడాల్సి ఉంది.

More articles

Latest article