. . . ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
దేశంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పై దాడి అమానుషమైన చర్య అని ప్రభుత్వ సలహాదారుల, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని సుభాష్ నగర్ లోని సుదర్శన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెలరోజులుగా నీట్ పరీక్ష విషయంలో న్యాయం చేయాలని విద్యార్థులు అడిగితే వారిపై లాఠీచార్జి చేయడం కేంద్ర ప్రభుత్వ అరాచక చర్య అని సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాపై మాట్లాడకుండా విద్యార్థుల ఉద్యమాన్నిఅణగదొక్కేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం మానుకోవాలని, దేశ భవిష్యత్తు ఆ విద్యా ర్థులు వారి న్యాయమైన కోరికను వెంటనే తీర్చాలని,కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పారిపెల్లి గంగారెడ్డి పాల్గొన్నారు.
