నీట్ పేపర్ లీక్‌పై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

0 9,642

 

. . . జాతీయ రహదారి – 161 పై కాంగ్రెస్ భారీ రాస్తారోకో

 

. . . డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

 

జుక్కల్, బతుకమ్మ :

 

రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టులను ఖండిస్తూ, నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ డిమాండ్ చేశారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా డీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో బుధవారం జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండల కేంద్రం నర్సింగ్‌రావుపల్లి చౌరస్తా వద్ద నాందేడ్ – 161 జాతీయ రహదారిపై రాస్తారోకో, ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండించిన నాయకులు, నీట్ పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, విద్యార్థుల భవిష్యత్తు రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని వారు స్పష్టం చేశారు. ఈ నిరసనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.