27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సిరిసిల్ల కాంగ్రెస్ గూండాల దాడి హేయనీయం

Must read

📰 Generate e-Paper Clip

  • మిస్టర్ రేవంత్ రెడ్డి ఇది ప్రజా పాలనా.. రౌడీ పాలనా..?
  • ప్రభుత్వ తీరును ఎండగడితే కేటీఆర్ పై రేవంత్ సర్కార్ కుట్ర
  • మా సహనాన్ని పరీక్షించొద్దు
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ : సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ గూండాల దాడి హేయనీయమని మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ‘బతుకమ్మ’ తో మాట్లాడుతూ కాంగ్రెస్ గుండాలు దాడికి పాల్పడితే..వారిని అడ్డుకున్న బిఆర్ఎస్ శ్రేణుల పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం దుర్మార్గమన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం నియంత పాలన చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజా పాలనా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రౌడీ పాలన చేస్తుందని దుయ్యబట్టారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజల్లో ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారని, ప్రజల నుండి బిఆర్ఎస్ కు విశేష ఆదరణ లభిస్తోందన్న విషయాన్ని ఓర్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర రాజకీయాలకు తెరలేపిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ గుండాలు దాడులు చేస్తున్న పోలీసులు దాడిని అపాల్సింది పోయి బీయర్ఎస్ శ్రేణులపై లాఠీఛార్జ్ చేసి వారు అత్యుత్సాహన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. మాది ప్రజా పాలన అని చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని నిట్టనిలువున  ఖూనీ చేస్తుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికారిక క్యాంప్ కార్యాలయాల్లో ఎప్పుడైనా ఆనాటి ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోటో పెట్టుకున్నారా? మరి ఈనాడు మా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ఫోటోలు ఎందుకు పెట్టాలని ఆయన ప్రశ్నించారు. ఏ  ప్రోటోకాల్ ఉందని సి.ఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సి.ఎం బట్టి విక్రమార్క సెక్రట్రేరియట్ ఛాంబర్ లో ఇందిరా గాంధీ, ఖర్గే ,సోనియాగాంధీ,రాహుల్ గాంధీ ల ఫోటో పెట్టారని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీ పూర్తి ప్రజాస్వామ్య యుతంగా వ్యవహరించిందని,కాంగ్రెస్ ప్రభుత్వం లాగా వ్యవహరించి ఉంటే కాంగ్రెస్ నాయకులు రోడ్డు పై తిరిగేవారే కాదని, నేడు అధికారం లోకి వచ్చేవారే కారని గుర్తు చేశారు.బిఆర్ఎస్ నేతల మంచితనాన్ని చేతగాని తనంగా భావిస్తే రేవంత్ రెడ్డి సర్కార్ తగిన మూల్యం చెల్లించక తప్పదని ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు “ఎవ్రీ డే ఈస్ నాట్ సండే” అని గుర్తుంచుకోవాలని సున్నితంగా పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేతగాక..ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న బిఆర్ఎస్ నేతలపై,శ్రేణులపై దాడులు చేయాలని చూస్తే సహించేది లేదని పేర్కొన్నారు. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతూ.. మా సహనాన్ని పరీక్షించొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తు, తొందరలోనే కాంగ్రెస్ పార్టీ ని రాజకీయాల నుండి డైవర్షన్  చేసి శాశ్వత విరామం కల్పిస్తామని  వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

More articles

Latest article