ఐఎంఎస్ఆర్ సీఎంసీ పై నిరాధార ఆరోపణలే

0 12,420

 

. . . సీఎండీ షణ్ముగ మహాలింగం

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాలో ప్రతిష్టాత్మకమైన సీఎంసీ మెడికల్ కళాశాల ప్రతిష్టన భంగపరిచేందుకే ఐఎంఎస్ఆర్ సీఎంసీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐఎంఎస్ఆర్  చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ షణ్ముగం మహాలింగం తెలిపారు. సిఎంసి మెడికల్ కళాశాల ప్రతిష్టను భంగపరిచేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, 200 కోట్ల పెట్టుబడితో కళాశాల ప్రారంభించేందుకు ప్రయత్నిస్తే దురుద్దేశ పూర్వకంగా ఐఎంఎస్ఆర్  సంస్థపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఇంటిగ్రేటెడ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షణ్ముగం మహాలింగం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిచ్ పల్లి మండలం సుద్దపల్లిలో గల సిఎంసి మెడికల్ కళాశాల వ్యవహారంలో ఇరువర్గాల మధ్య జరుగుతున్న వివాదాలను వివరించారు. సిఎంసి క్యాంపస్‌లో జరిగిన ఘటనల నేపథ్యంలో ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా  కేసు నమోదు చేయకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఎఫ్‌ఐఆర్ నం.176/2026 ద్వారా సిఎస్ఐ సంస్థ ప్రతినిధులైన బి. విమల్ సుకుమార్  దయానంద్  కె వి ప్రసాద్  నిబంధనలకు విరుద్ధంగా కళాశాల లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అజ్జ శ్రీనివాస్ తో పాటు మరో ఇద్దరిపై ఈనెల 11న కేసు నమోదైనట్లు తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా కొందరు వ్యక్తులు సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అసత్య ఆరోపణలు చేస్తూ తనపై డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో మరోసారి తప్పుడు ఫిర్యాదు చేశారని చెప్పారు. తనతో సి ఎస్ ఐ సంస్థ ప్రతినిధులకు మధ్య ఎటువంటి చట్టబద్ధమైన ఎంఓయూ కుదరలేదని  నకిలీ ఐఏఎస్ పేరుతో తాను చలామణి అవుతున్నట్లు ఫిర్యాదు చేశారని వివరించారు.అయితే పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టకుండా గతంలో మాదిరిగానే ఏకపక్షంగా వ్యవహరించి తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలియజేశారు. ఇరు వర్గాల మధ్య జరుగుతున్న వివాదాన్ని విచారణ చేపట్టి పరిష్కరించాల్సిన పోలీసులు వివక్ష చూపుతూ నిరాధార ఆరోపణలతో తనపై కేసులు నమోదు చేయడం భావ్యం కాదని అన్నారు. తాము ఇప్పటికే మెడికల్ కళాశాల పునరుద్ధరణకై సుమారు 25 కోట్ల మేరకు నిధులు వెచ్చించామని  ఆర్థిక లావాదేవీల కు సంబంధించిన అన్ని సాక్షాలు తమ వద్ద ఉన్నాయని డాక్టర్ షణ్ముఘం మహాలింగం స్పష్టం చేశారు. ప్రస్తుతం కొందరు వ్యక్తులు సిఎంసి పేరును ఉపయోగించి కొందరితో లావాదేవీలు జరిపినట్లు తమ దృష్టికి వచ్చిందని  అలాంటి చర్యలకు ఐఎంఎస్ఆర్  అనుమతి లేదని తెలిపారు. వైద్య కళాశాల నిర్వహణకు అవసరమైన సామర్థ్యం, అనుభవం, వనరులు ఐఎంఎస్‌ఆర్‌కు సమృద్ధిగా ఉన్నాయని, బయటి వ్యక్తుల సహాయం అవసరం లేదన్నారు. తనకు ఐఎంఎస్‌ఆర్ తరఫున ప్రాతినిధ్యం వహించే అధికారం లేదని కొందరు  సీఎంఆర్  సభ్యులు  డా. అజ్జ శ్రీనివాస్ ఆరోపించడాన్ని తోసిపుచ్చారు. అజ్జ శ్రీనివాస్ పై ఇప్పటికే డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు కాగా, నాంపల్లి న్యాయస్థానంలో ఐదు కోట్లకు సంబంధించిన చెల్లుబాటు కానీ చెక్కుల విషయంలో మరో క్రిమినల్  వ్యాజ్యం పెండింగుల్లో ఉందని తెలియజేశారు. కొందరు సీఎంసీ  ప్రతినిధులతో పాటు డాక్టర్ శ్రీనివాస్ పై ఇప్పటికే మరోమారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని,అవసరమైతే సహకరించిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అక్టోబర్ 2024 నుంచి సీఎస్‌ఐ టీఏ మెదక్ డయాసిస్‌తో కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు సిఎంసి క్యాంపస్‌లో పలు అభివృద్ధి  సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. గత రెండేళ్లుగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు  సమాజ సేవలను ప్రజలకు వివరించడంతో పాటు సంస్థపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు తెలియజేస్తున్నామని ఆయన వివరణ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.