ఐఎంఎస్ఆర్ సీఎంసీ పై నిరాధార ఆరోపణలే
. . . సీఎండీ షణ్ముగ మహాలింగం నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ప్రతిష్టాత్మకమైన సీఎంసీ మెడికల్ కళాశాల ప్రతిష్టన భంగపరిచేందుకే ఐఎంఎస్ఆర్ సీఎంసీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐఎంఎస్ఆర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ షణ్ముగం మహాలింగం తెలిపారు. సిఎంసి మెడికల్ కళాశాల ప్రతిష్టను భంగపరిచేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, 200 కోట్ల పెట్టుబడితో కళాశాల ప్రారంభించేందుకు ప్రయత్నిస్తే దురుద్దేశ పూర్వకంగా ఐఎంఎస్ఆర్ సంస్థపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు....