. . . ప్రత్యేక పూజల్లో పాల్గొన్న గణేష్ బిగాల, మహేష్ బిగాల
మాక్లూర్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా మాక్లూర్‌లోని శ్రీ విట్ఠలేశ్వర రుక్మిణి దేవస్థానం, శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం, శ్రీ వీర హనుమాన్ స్వామి ఆలయాల నాల్గవ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, బీఆర్‌ఎస్ పార్టీ ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పాల్గొన్నారు. బిగాల సోదరుల ఆధ్వర్యంలో నిర్మించబడిన ఈ ఆలయాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న గణేష్ బిగాల, మహేష్ బిగాల రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు.

వార్షికోత్సవ వేడుకల సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో బిగాల సోదరులు నిరంతరం కృషి చేస్తున్నారని భక్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

