28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ముద్దాయి దోషిగా నిర్ధారణ.. శిక్షల ఖరారు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఒక వ్యక్తిని కొట్టి గాయపరచి, కులం పేరుతో బహిరంగ ప్రదేశంలో అవమానించిని ఐల క్రాంతికుమార్ కు ఒక సంవత్సరం, ఆరు నెలల చొప్పున జైలుశిక్షలు విదిస్తూ నిజామాబాద్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అత్యాచారాల విచారణ న్యాయస్థానం స్పెషల్ జడ్జి టి. శ్రీనివాస్ మంగళవారం తీర్పు చెప్పారు. కోర్టు విలువరించిన నలభై పేజీల తీర్పులోని వివరాలు. నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ 2021 వ సంవత్సరంలో కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రం అనుసారం నేరన్యాయ విచారణలో భాగంగా మొత్తం పదకొండు మంది సాక్షుల సాక్ష్యాలు నమోదు చేసుకుని, పది ధ్రువీకరించుకున్న పత్రాలు, రెండు వస్తుగత సాక్ష్యాలు మార్క్ చేసుకుని అధ్యయనం చేసిన అనంతరం నిజామాబాద్ నగరంలోని మిర్చి కంపౌండ్ కు చెందిన క్రాంతికుమార్ పెద్దిగారి సతీష్ ను మిర్చి కంపౌండ్ లోని దారిలో అటకాయించి కొట్టి గాయపరచి, కులం పేరుతో దూశించిండు అనే నేర అభియోగాలు రుజువైనట్లు నిర్దారిస్తూ ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ 324 గాయపరచినందుకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్షతో పాటు ఐదు వందల రూపాయల జరిమానా విధించారు. సెక్షన్ 506 నేరపూరిత బెదిరింపులకు గాను ఆరు నెలల జైలు ఐదు వందల రూపాయల జరిమానా,సెక్షన్ 341 ఒక వ్యక్తిని అక్రమంగా అడ్డుకోవడంకు గాను పదిహేను రోజుల జైలు రెండు వందల రూపాయల జరిమానా, సెక్షన్ 290 పబ్లిక్ న్యూసెన్స్ చేసినందుకుగాను రెండు వందల రూపాయల జరిమానా విధించారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల పై అత్యాచారాల నిరోధక చట్టంలోని రెండు సెక్షన్లకుగాను ఆరు నెలల చొప్పున కఠిన జైలుశిక్షలు, ఐదు వందల రూపాయల చొప్పున జరిమానాలు విధించారు. శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.

More articles

Latest article