ముద్దాయి దోషిగా నిర్ధారణ.. శిక్షల ఖరారు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఒక వ్యక్తిని కొట్టి గాయపరచి, కులం పేరుతో బహిరంగ ప్రదేశంలో అవమానించిని ఐల క్రాంతికుమార్ కు ఒక సంవత్సరం, ఆరు నెలల చొప్పున జైలుశిక్షలు విదిస్తూ నిజామాబాద్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అత్యాచారాల విచారణ న్యాయస్థానం స్పెషల్ జడ్జి టి. శ్రీనివాస్ మంగళవారం తీర్పు చెప్పారు. కోర్టు విలువరించిన నలభై పేజీల తీర్పులోని వివరాలు. నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ 2021 వ సంవత్సరంలో కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రం అనుసారం నేరన్యాయ విచారణలో భాగంగా...