29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

99 రోజుల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మార్చి 6 నుండి జూన్ 12 వరకు జరిగే ఈ 99 రోజుల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రాబోయే99 రోజులలోపోలీస్ శాఖ తరపున చేపట్టవలసిన పనులపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పోలీస్ సిబ్బందికి సూచించిన ముఖ్యమైన అంశాలు, లక్ష్యాలు తెలియజేశారు. సిబ్బంది కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో గ్రామాలను సందర్శించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

The 99-day plan should be implemented effectively.

 

జిల్లాలో పెట్టుబడులను ఆకర్షించడానికి, సర్వతోముఖాభివృద్ధికి శాంతిభద్రతలు కీలకమని, వీటిని కఠినంగా అమలు చేయాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్లో 5ఎస్ విధానం అమలు చేయాలని, రికార్డుల అనుసంధానం, వాహనాల పార్కింగ్ వ్యవస్థ, పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ సెంటరు మొదలగునవి క్షుణ్ణంగా అమలు చేయాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సీసీటీవీ సర్వైలెన్స్ పెంచాలని, గ్రౌండ్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను కఠినతరం చేయాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.సైబర్ నేరాలు, డ్రగ్స్ దుర్వినియోగం, భరోసా సెంటర్,సఖి సెంటర్, షీ టీమ్స్ సేవలు, మహిళల హక్కులపై ముఖ్యంగా యువత, విద్యార్థులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. పెండింగ్ కేసుల పరిష్కారం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కే. శ్రీధర్ రెడ్డి, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ అంజయ్య, ఐటీ సెల్ సిబ్బంది కమ్యూనికేషన్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.

The 99-day plan should be implemented effectively.

More articles

Latest article