33.2 C
Hyderabad

19వ డివిజన్ అభ్యర్థి మేయర్ అయ్యే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మేయర్ అభ్యర్థి కాట్ పల్లి శమంత నరేందర్ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ  :

 

19వ డివిజన్ కార్పొరేటర్ గా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న విషయం కాట్ పల్లి శమంత నరేందర్ రెడ్డికి ఓటు వేసి మేయర్ గా గెలిపించుకోవాలని ఆమె కోరారు. గురువారం కాటిపల్లి శమంత నరేందర్ రెడ్డి కాలనీ లో తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మారుతీ నగర్ కాలనీ వాస్తవ్యులుగా తాను నిజామాబాద్ నగర మేయర్ అభ్యర్థి కాట్ పల్లి శమంత నరేందర్ రెడ్డి 19వ వార్డు నుండి కార్పొరేటర్ గా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నానని తెలిపారు. ఎన్నో సంవత్సరాల తర్వాత మన కాలనీ నుండి మేయర్ అయ్యే సువర్ణ అవకాశం లభించిందని ఈ అవకాశాన్ని మనందరం సద్వినియోగం చేసుకొని పార్టీలకతీతంగా  బలపరిచినట్లయితే మన కాలనీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చన్నారు. కాలనీలోని అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నిధుల సమస్య లేకుండా మన కాలనీని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

More articles

Latest article