నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రైవేట్ ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన లో భాగంగా గురువారం ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద మార్చ్ టు పార్లమెంట్ & ధర్నా నిర్వహించారు. అనంతరం నిజామాబాద్ జిల్లా రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టీఈటీ మినహాయింపు ఇవ్వాలని, లక్షలాది ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరణ చేయాలన్నారు. శాస్త్రీయ విద్యా విధానానికి తూట్లు పొడిచే జాతీయ విద్యా విధానం -2020 ని రద్దు చేయాలని, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని, పాఠశాల విలీనం, మూసివేత మానుకోవాలన్నారు. ఐ.టీ స్లాబులు సవరించాలని, ప్రైవేట్ ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన లో భాగంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో తరలి రాగా జిల్లా అధ్యక్షులు రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్, జిల్లా కార్యదర్శులు జనార్దన్, బాబులు జిల్లా కమిటీ సభ్యులు ప్రభాకర్ పాల్గొన్నారు.