29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉత్సవాలకు సహకరించిన వారికి కృతజ్ఞతలు

Must read

📰 Generate e-Paper Clip

పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్

నిజామాబాద్, బతుకమ్మ : గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపన, నిమజ్జనం. మిలాద్ ఉన్ నబీ పండుగల నిర్వాహణకు సహకరించిన ప్రతీ ఒక్కరికి పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ కృతజ్ఞతలు తెలిపారు.   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ,ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గణేష్ విగ్రహ ప్రతిష్టాపన నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ పండుగ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ జరుపుకున్నారని తెలిపారు.   నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో దాదాపు 6000 గణేష్ విగ్రహాలు ప్రతిష్ఠించారని అన్నారు. ప్రతిష్ఠాపన అనంతరం భక్తులందరూ సాంప్రదాయం ప్రకారం 9, 11 రోజుల పాటు మండపాలలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి తదుపరి నిమజ్జనం చేశారని పేర్కొన్నారు. దీనికి అన్ని మతాల ప్రజలు స్వచ్చందంగా సహకరించుకొని జయప్రదం చేశారని తెలిపారు.

More articles

Latest article