26.1 C
Hyderabad

తాళ్ల రాంపూర్ సర్పంచ్ బెజ్జారపు పావని మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచిగా గెలుపొందిన బెజ్జారపు పావని గురువారం మృతి చెందారు. ఈ విషాద ఘటనతో తాళ్ల రాంపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో సర్పంచ్ బెజ్జారపు పావని అందరిని ప్రేమతో ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, గ్రామ ప్రజలతో కలిసిమెలిసి ఉండే వ్యక్తిగా మంచి పేరు గుర్తింపు ఉందని గ్రామస్తులు తెలిపారు. అలాగే చిన్న వయసులో సర్పంచిగా ఎన్నికైన ఆమె గ్రామాభివృద్ధికి కృషి చేయాలని తపించే వ్యక్తి అని అన్నారు. అలాంటి వ్యక్తి మృతి చెందడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు మండల పరిధిలోని ప్రజా ప్రతినిధులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

More articles

Latest article