29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రోడ్డు వేయాలని కోరిన కుటుంబంపై కార్పొరేటర్ భర్త దాడి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 29వ డివిజన్‌లో ఉద్రిక్తత

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

స్థానికంగా రోడ్డు నిర్మించాలని కోరినందుకు ఓ కుటుంబంపై దాడి జరిగిందని బాధితులు ఆరోపించారు. ఈ ఘటన 29వ డివిజన్‌లో జరిగినట్లు సమాచారం. బాధితుల కథనం ప్రకారం, మహమ్మద్ నహీం, ఆయన కుటుంబ సభ్యులు వర్షపు నీరు నిల్వ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రోడ్డు వేయాలని స్థానిక కార్పొరేటర్‌ను కోరారు. అయితే ఈ విషయంపై జరిగిన వాగ్వాదం అనంతరం కార్పొరేటర్ అనీస్ ఫాతిమా భర్త ఎం.ఏ.ఖదీర్, ఆయన కుమారుడు కలిసి తమపై దాడి చేసి కొట్టారని వారు ఆరోపిస్తున్నారు. ఘటన అనంతరం బాధితులు డయల్ – 100 కు ఫోన్ చేయగా, పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. ఈ ఘటన అనంతరం కార్పొరేటర్ దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవగా, పోలీసులు మాత్రం తమకి ఎలాంటి ఫిర్యాదులు అందలేదనడం గమనార్హం.

 

More articles

Latest article