విజయ డెయిరీ సహకారంతో..
అయోడిన్ ఉప్పు నాణ్యతపై ఫిర్యాదు
నిజామాబాద్, బతుకమ్మ : ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో పాల నాణ్యతపై టెస్ట్ చెక్ కార్యక్రమం నగరంలోని విజయ డెయిరీ లో నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా లో ప్రతి రోజు 50 వేల లీటర్ల పాల అమ్మకం జరుగుతుందన్నారు. ఈక్రమంలో పాల నాణ్యతపై విజయ డెయిరీ సహకారం తో డెయిరీ లాబోరేటరీలో టెస్ట్ చెక్ నిర్వహించామన్నారు. ప్రయివేటు పాల డెయిరీ లు, తమ పాల పాకెట్ లపై ముద్రించిన మాదిరిగా నాణ్యతా ప్రమాణాల సమాచారం టెస్ట్ చెక్ లో దృవీకరణ చేశామన్నారు. అనంతరం ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి అధ్యక్ష, కార్యదర్శులు పెందోట అనిల్ కుమార్, సందు ప్రవీణ్ లు ఉపాధ్యక్షులు వెంకట నర్సింహ వర్మ, రాజుల రామనాధం, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు పౌడపెల్లి అనిల్ లు ఫుడ్ సేఫ్టీ కార్యాలయంలో అయోడిన్ ఉప్పు నాణ్యతపై అధికారులకు ఫిర్యాదు చేశారు.

