25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఫలితాలపై టెన్షన్‌.. టెన్షన్‌

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వెబ్‌ డెస్క్‌
ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వంటి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌`యూజీ) ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 1 దాటినా విడుదల కాలేదు. అయితే ఏ క్షణాన అయినా ఈ ఫలితాలు వెల్లడికానున్నాయి. మే 4న జాతీయంగా ఈ పరీక్షను నిర్వహించారు. ఫలితాల ముందు విడుదల చేసే ఫైనల్‌ కీని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) శనివారం ఉదయం విడుదల చేసింది. దీంతో ఫలితాల విడుదల ఒక్కటే మిగిలింది. అయితే ఫైనల్‌ కీలో ఎన్టీఏ ఒక్క మార్పు చేసింది. ఫిజిక్స్‌లో ఒక ప్రశ్న సమాధానంగా రెండు ఆప్షన్లను ఖరారు చేసింది. రెండు ఆప్షన్స్‌ లో ఏ ఆప్షన్ను ఎంపిక చేసుకున్నా మార్కులేస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 72,507 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు.

More articles

Latest article