25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

లింగంపేట్ లో ఉద్రిక్తత

Must read

📰 Generate e-Paper Clip

  • అంబేద్కర్ జయంతి రోజున దళితులకు అవమానం
  • సీఐ రవీందర్ నాయక్ అత్యుత్సాహం

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ : డా.బీ.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా లింగంపేట్ మండల కేంద్రంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని లింగంపేట్ లో అంబేద్కర్ జయంతి రోజున

Tension in Lingampet

దళితులకు అన్యాయం జరిగింది.పట్టణంలోని ప్రధాన చౌరస్తా లో గల అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన మాజీ ఎంపిపి,అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షులు ముదం సాయిలుతో పాటు మరో ఐదుగురు దళితుల పట్ల సీఐ రవీందర్ నాయక్ అత్యుత్సాహం ప్రదర్శించారు.

Tension in Lingampet

అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లపై మొదలైనవివాదం కారణంగా, ముదం సాయిలు ను అరెస్ట్ చేస్తుండగా సీఐ రవీందర్ నాయక్ బూతు పదజాలంతో, ఇష్టారీతిగా ప్యాంటు ఊడదీసి, అరెస్ట్ చేయడమేంటని దళిత సంఘాలు అగ్రహించాయి. సీఐ రవీందర్ నాయక్ వచ్చి దళితులకు క్షమాపణ చెప్పే వరకు ఇక్కడే ధర్నా

Tension in Lingampet

విరమించేది లేదని తెలిపారు.ఈ విషయమై మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ… అంబేద్కర్ జయంతి రోజునే దళితులకు రక్షణ లేకపోతే,ఎలా అని ప్రశ్నించారు. రక్షించాల్సిన పోలీసులే ఇలా ప్రభుత్వానికి కొమ్ము కాస్తే ఎలా అని అగ్రహించారు.డీఎస్పీ వచ్చి, సముదయించడంతో ఆందోళన విరమించారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tension in Lingampet

More articles

Latest article