24 C
Hyderabad
Sunday, August 2, 2026

దురాలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

సీపీ సాయి చైతన్య

సుద్దపల్లి ఆశ్రమ్ హై స్కూల్ లో విద్యార్థులతో సహపంక్తి భోజనం

నిజామాబాద్, బతుకమ్మ : దురాలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని సీపీ సాయిచైతన్య సూచించారు. ఆదివారం రాత్రి  డిచ్ పల్లి మండలం సుద్దపల్లి ఆశ్రమ్ హైస్కూల్ ను సందర్శించారు. విద్యార్థులకు భోజనం వడ్డించి వారితో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం కంప్యూటర్ రూమ్,  లైబ్రరీ రూమ్,  మెడికల్ రూమ్,  కిచెన్ సెక్షన్ లో గల వసతులను తనిఖీ చేశారు. వాటిని ఏ విధంగా వాడుకుంటున్నారో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మట్లాడారు. విద్యార్థి దశ నుంచి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని సూచించారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదివి తమ లక్ష్యాలను సాధించవచ్చన్నారు. ఈసందర్భంగా  నో స్మోకింగ్, నో డ్రింకింగ్, నో డ్రగ్స్ నినాదాలను విద్యార్థులకు తెలియజేశారు. ఈకార్యక్రమంలో డిచ్ పల్లి సీఐ మల్లేష్ , డిచ్ పల్లి ఎస్సై ఎం.డి. షరీఫ్, ఆశ్రమ్ హై స్కూల్ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Students should stay away from bad habits

More articles

Latest article