27.2 C
Hyderabad

బాన్సువాడ మున్సిపాలిటీ 9వ వార్డులో ఉద్రిక్తత

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కాంగ్రెస్‌కు ఓటేయాలని పోలింగ్‌ బూత్‌ వద్ద కానిస్టేబుల్‌ క్యాంపెయిన్‌..

 

. . . నిలదీసిన బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు.

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ మున్సిపాలిటీలో ఓ కానిస్టేబుల్‌ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను ప్రలోభపెట్టారు. బాన్సువాడ మున్సిపాలిటీ 9వ వార్డులో బందోబస్తు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఓటర్లకు చెబుతుండగా అక్కడే ఉన్న బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నిలదీశారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకోగా గొడవకు దారి తీసింది. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ వెంకటరావు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

More articles

Latest article