26.3 C
Hyderabad
Monday, August 3, 2026

గాంధీ భవన్‌లో తెలంగాణ మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ముఖ్య అతిథిగా ఆల్కా లాంబా

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం గాంధీ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఆల్కా లాంబా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెకు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆల్కా లాంబాకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయంగా స్వాగతం తెలిపారు.

 

Telangana Women's Congress Executive Committee meeting at Gandhi Bhavan.

 

అనంతరం జరిగిన కార్యవర్గ సమావేశంలో తెలంగాణలో మహిళా కాంగ్రెస్ సంస్థాగత బలోపేతం, మహిళల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడం, పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై నిర్వహించాల్సిన ఉద్యమాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశం అనంతరం ఆల్కా లాంబా, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల హక్కుల పరిరక్షణ, మహిళా సాధికారత, రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ చేపట్టనున్న కార్యాచరణ, ప్రజా సమస్యలపై పార్టీ చేపట్టనున్న పోరాటాలపై మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Telangana Women's Congress Executive Committee meeting at Gandhi Bhavan.

More articles

Latest article