30.4 C
Hyderabad

పోలీస్ శాఖ ఆధ్యర్యంలో సైకిల్  బైక్ ర్యాలీ

Cycle and bike rally organized by the Police Department

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ర్యాలీ ప్రారంభించిన అదనపు పోలీస్ కమిషనర్ శుభం ప్రకాష్

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరిoచుకొని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నగరంలో  సైకిల్,  బైక్ ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు అదనపు డిసిపి  (అడ్మిన్) శుభం ప్రకాష్ ఆధ్వర్యంలో సైకిల్ / బైక్ ర్యాలీ ఆదివారం ఉదయం 8  గంటలకు పూలాంగ్ చౌరస్తా నుండి  అదనపు పోలీస్ కమిషనర్ శుభం ప్రకాష్ జండాఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ పూలాంగ్ చౌరస్తా నుండి ప్రగతి హాస్పిటల్,  ఎల్ఐసి చౌరస్తా, కోర్టు చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా , పోలీస్ హెడ్ క్వార్టర్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎందరో పోలీస్ సిబ్బంది అంతర్గత భద్రత కాపాడటానికి నక్సలైట్లు , మతపరమైన విభజన శక్తులు , ఇతర సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోంటూ నేరాల అరికట్టడం , మాదక ద్రవ్యాల అణచివేయడానికి , మహిళ భద్రతకు , తమ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. వీరి త్యాగాల వల్లనే ఈ రోజు దేశం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ కమిషనరేటు లో ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఈ నేల చెరగని ముద్ర వేసిందని అన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చూడాలని , ఎక్కడ ఎలాంటి సంఘటన చోటు చేసుకున్న , వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ మేరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా పోలీసు కుటుంబాలను పరామర్శించినట్లు తెలిపారు. మన పోలీసులు ఒకటే కుటుంబం వారు వేసుకున్న యూనిఫాం అందరికీ గర్వకారణమని వారి త్యాగాల వల్ల నేడు మనం గర్వంగా బతుకుతున్నామని కొనియాడారు. ఈ దేశం కోసం న్యాయం కోసం , ఎప్పటికీ తలవంచకుండా పక్షపాతం లేకుండా , సేవా చేయడానికి మన హృదయలతో ప్రమాణం చేద్దామని పేర్కొన్నారు.ఈ కార్యాక్రమంలో సి.ఐలు, రిజర్వు ఇన్స్ పెక్టర్లు, ఎస్.ఐలు, ఆర్.ఎస్.ఐలు, ఆర్మూడ్ రిజర్వు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article