గాంధీ భవన్‌లో తెలంగాణ మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం
. . . ముఖ్య అతిథిగా ఆల్కా లాంబా హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం గాంధీ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఆల్కా లాంబా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెకు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆల్కా లాంబాకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయంగా స్వాగతం తెలిపారు. ...