32.8 C
Hyderabad

వాటర్ బోర్డు జాయింట్ డైరెక్టర్ కారులో రూ.2.40 లక్షలు 

Rs 2.40 lakh found in Water Board Joint Director's car

Must read

📰 Generate e-Paper Clip

 

. . .ఏసీబీ తనిఖీలలో దోరికినలెక్కల్లో లేని నగదు

హైదరాబాద్‌, బతుకమ్మ:

వాటర్‌ బోర్డుకు చెందిన ఓ ఉన్నతాధికారి కార్యాలయం నుంచి అక్రమంగా వసూలు చేసిన నగదుతో ఇంటికి వెళ్తున్నారంటూ గుర్తుతెలియని వ్యక్తి  ఎసిబీకి విశ్వసనీయ సమాచారం అందించారు. ఏసీబీ సిటీ రేంజ్‌-2 అధికారులు శనివారం రాత్రి హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ రోడ్డులో మెట్రో రెసిడెన్సీ అపార్ట్‌మెంట్స్‌ ఎదురుగా కారును అధికారులు అడ్డుకున్నారు. ఆ కారు హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డు జాయింట్‌ డైరెక్టర్‌ ఏ. శ్రీనివాస్‌కు చెందినదిగా గుర్తించారు. కారులో రూ.2.40 లక్షల లెక్కల్లో చూపని నగదును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు  గుర్తించారు. ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చింది, తన వద్ద ఎందుకు ఉందనే ప్రశ్నలకు ఆయన సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేదని, పొంతనలేని సమాధానాలు చెప్పారని ఏసీబీ అధికారులు తెలిపారు.దీంతో లెక్కల్లో చూపని నగదును పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్న అధికారులు, అవినీతి కోణంలో తదుపరి విచారణ చేపట్టేందుకు, అవసరమైన చర్యలు తీసుకునేందుకు చర్యలు ప్రారంభించారు. ఆదాయపు పన్ను శాఖకు కూడా సమాచారం అందించనున్నట్లు వెల్లడించారు.కోన్ని రోజుల క్రితం వాటర్ బోర్డు డిజిఎం అనే అవినీతి తిమింగలంను ఎసిబి అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే.

 

More articles

Latest article