26.2 C
Hyderabad

తెలంగాణ వైతాళికులు దాశరథి కృష్ణమాచార్యులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బార్ అసోసియేషన్ నివాళులు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ వైతాళికులు దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతిని మంగళవారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బార్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి దాశరథి పద్యాగేయం నా తెలంగాణ కోటి రతనాల వీణ ప్రేరణగా నిలిచి రాష్ట్ర సాధనకు ఉపయోగ పడిందని అన్నారు.తెలంగాణ సమాజానికి సాహిత్యపు ధారను ప్రవహింప జేశారని తెలిపారు.నిజాము సర్కారుకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు అని, దాశరథిని నిజామాబాద్ జైలులో బందించిన ఘడియలు తెలంగాణ సమాజాన్ని తట్టిలేపాయని పేర్కొన్నారు. దాశరథి సాహితీ సంపద నేటికి తెలంగాణ ప్రజల జనజీవితంలో పాటలై, పద్యాలై ప్రవహిస్తున్నదని ఆయన తెలిపారు.దాశరథి కృష్ణమాచార్యుల జీవనమే ఒక అధ్యాయనంగా, స్ఫూర్తిగా తెలంగాణ సమాజం ప్రగతిపథనా పయనించాలని సాయరెడ్డి అకాక్షించారు.కార్యక్రమంలో బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, ఉపాధ్యక్షుడు దిలీప్, ప్రభుత్వ న్యాయవాది అమిదాల సుదర్శన్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహ రెడ్డి,చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేధార్, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఆకుల రమేష్, దాదన్నగారి మధుసుధన్ రావు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article