26.2 C
Hyderabad
Monday, August 3, 2026

మళ్ళీ తెరపైకి తెలంగాణ విశ్వవిద్యాలయ భూములు

Must read

📰 Generate e-Paper Clip

  •  50 ఎకరాల భూమి చుట్టు వివాదాలు
  • హైకోర్టు తీర్పును సవాల్ చేయకపోవడంపై విమర్శలు
  • యూనివర్సిటీ రిజిస్ట్రార్ ను టార్గెట్ చేసిన ప్రజాసంఘాలు

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం కు సంబంధించిన 59 ఎకరాల భూమి విషయం ప్రైవేట్ టౌన్ షిప్ సంస్థ స్వాధీనం వ్యవహరం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 2011లో ప్రైవేట్ వ్యక్తులు సర్వే నంబర్ 334లో 50 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి కాదని జిల్లా న్యాయస్థానంలో సవాల్ చేయగా అది ప్రభుత్వ భూమేనని 2012లో తీర్పు వచ్చింది. దానిని ప్రైవేట్ వ్యక్తులు 2018 హైకోర్టులో సవాల్ చేయగా ఈ యేడాది ఏప్రిల్ 2న ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పు వచ్చింది. సంబంధిత తీర్పుపై ప్రభుత్వం దానిని సవాల్ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇటీవల హైకోర్టులో అనుకూల తీర్పులు వచ్చిన ప్రైవేట్ వ్యక్తులు తమ కార్యకలాపాలను చేపట్టడానికి సిద్దం అవుతుండడంతో తెయూ భూముల వివాదం తెరపైకి వచ్చింది. ప్రధానంగా యూనివర్సిటీకీ వీసీ లేకపోవడంతో అంతా తానై వ్యవహరిస్తున్న రిజిస్ట్రార్ పట్టించుకోవడం లేదని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అవుతుంటే అందున ప్రభుత్వ మారిన వెంటనే జరుగుతున్న తతంగంపై ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పేరిట ఏర్పాటు చేసిన తెలంగాణ విశ్వవిద్యాలయం భూముల వివాదాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ హయంలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఐదు యూనివర్సిటీలు ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. నిజామాబాద్ జిల్లాకు దగ్గరగా జాతీయ రహదారికి ఆనుకుని నడిపల్లి శివారులో వందలాది ప్రభుత్వ భూములు ఉండడంతో సర్వే నిర్వహించి అక్కడ తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటుకు సంకల్పించారు. 2007 సెప్టెంబర్ 3న 267, 334, 265, 277, 278, 603 సర్వే నంబర్ లలోని 501.9 ఎకరాల భూమిని యూనివర్సిటీకి దారధత్తం చేశారు. సర్వే నంబర్ 264లో 69.21 ఎకరాలు, వివిధ సర్వే నంబర్ లలో 7.4 ఎకరాలు మొత్తం కలిపి 578.02 ఎకరాలను తెలంగాణ యూనివర్సిటీకి కేటాయిస్తున్నట్లు హద్దులు చూపి అప్పటి యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ కు స్వాధీన పరిచారు. అయితే యూనివర్సిటీకి కేటాయించిన భూముల్లో 50 ఎకరాలు తమవేనని ఒక టౌన్ షిప్ సంస్థ కోర్టును ఆశ్రయించడంతో వివాదం మొదలయింది. ఈ యేడాది ఆరంభంలో అత్యున్నత న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పు ఇవ్వగా దానిని ప్రభుత్వం సవాల్ చేయకపోవడంతో వివాదం ముదిరి పాకాన పడుతుంది.
తెలంగాణ విశ్వవిద్యాలయం భూముల విషయంలో అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపణలు పెరుగుతున్నాయి. ప్రధానంగా కోట్ల విలువ చేసే భూమిని ప్రైవేట్ సంస్థలకు ధారదత్తం చేసేందుకే పావులు కదుపుతున్నారని వాదనలున్నాయి. ఈ విషయంలో ప్రజాసంఘాలు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ను టార్గెట్ చేశాయి. అయితే రిజిస్ట్రార్ మాత్రం హైకోర్టు ప్రైవేట్ సంస్థకు అనకూలంగా తీర్పు ఇవ్వగానే భూమి వివాదం విషయాన్ని వీసీ బుర్ర వెంకటేశంతో పాటు జిల్లా కలెక్టర్ కు అధికారులకు సమాచారం అందజేశామని తెలిపారు. సంబంధిత తీర్పుపై అపీల్ కు వెళ్లేందుకు ప్రభుత్వం తరపున ప్రభుత్వ న్యాయవాది ప్రయత్నాలు చేస్తున్నారని లేఖను విడుదల చేశారు. ఆగస్టు మాసంలో జరిగిన విషయాన్ని ప్రస్తుతం పత్రికలకు విడుదల చేయడం విశేషం. ప్రజాసంఘాలు యూనివర్సిటీ రిజిస్ట్రార్ పై ఆరోపణలు చేయగానే పత్రాలను బహిర్గతం చేశారని అప్పటి వరకు విశ్వవిద్యాలయంలో భూముల విషయంలో జరుగుతున్న తతంగాన్ని కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఎందుకు బయటపెట్టలేదన్న చర్చ జరుగుతుంది.

 

Telangana University lands on the screen again

More articles

Latest article