29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

తెలంగాణ యునివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 2,4,6 సెమిస్టర్ ల ఫలితాలను విడుదల చేసిన వైస్ ఛాన్స్ లర్

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

తెలంగాణ విశ్వవిద్యాలయ పరీక్షా విభాగం ఏప్రిల్ – మే 2026 లో నిర్వహించిన 2, 4, 6 సెమిస్టర్ యుజి రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయ అధికారులు సోమవారం విడుదల చేశారు. విశ్వవిద్యాలయ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య టి. యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య యం.యాదగిరి తో కలిసి ఫలితాలు విడుదల చేశారు. ఈ సందర్బంగా వైస్ ఛాన్సలర్ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆరవ సెమిస్టర్ లో 4970 విద్యార్థులకు గాను 3091 మంది ఉత్తీర్ణులయ్యారని, 4వ సెమిస్టర్ లో 4427 విద్యార్థులకు గాను 1714 మంది ఉత్తీర్ణులయ్యారని, 2వ సెమిస్టర్ లో 5139 విద్యార్థులకు గాను 2000 మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ద్వారా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.telanganauniversity.ac.in లో ఫలితాలను తెలుసుకోవచ్చని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆచార్య సంపత్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కె. సంపత్ కుమార్, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య జి. చంద్రశేఖర్, డాక్టర్. నందిని డాక్టర్ శాంత పాల్గొన్నారు.

More articles

Latest article