రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం బీజేపీ పార్టీ శ్రేణులు జాతీయ జెండా ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలంగాణ తెచ్చింది బిజెపి పార్టీనేనని అన్నారు. తెలంగాణ మేము తెచ్చాము, మేము ఇచ్చాము అనేవాళ్ళు దాంబికాలు పలకడం తప్పితే అందులో వాస్తవం ఏమీ లేదని అన్నారు. తెలంగాణ ప్రజల కోరికకు మద్దతు తెలిపి వారి కోసం పోరాడింది బిజెపి అని, ఆ పోరాటంలో సుష్మా స్వరాజ్ ది ముఖ్యపాత్ర అని, అందుకే ఆమెను తెలంగాణ చిన్నమ్మ అంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గుండూరి ప్రశాంత్ గౌడ్, కోటగిరి మండల అధ్యక్షులు ఏముల నవీన్ ఉపాధ్యక్షులు బేగరి వినోద్ కుమార్, భోజిగొండ అనిల్, బివి గుప్తా, కటిక రామరాజు, చిదుర మహిపాల్, బేగరి శివప్రసాద్, కుమ్మరి గణేష్, ఎర్రోళ్ల గంగాధర్, పార్వతి మురళి, బైండ్ల బాలరాజ్, గౌతి కళ్యాణి, మామిడి శ్రీనివాస్, బైండ్ల సంజీవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
