28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

తెలంగాణ రాష్ట్ర సేన

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రాజకీయ పార్టీ ఏర్పాటు వెనుక ఇంత మతలబ్ ఉందా

 

. . . తెలంగాణ సెంటిమెంటును ఓన్ చేసుకునేందుకేనా

 

. . . టిఆర్ఎస్ పేరుతో కలవకుంట్ల కుటుంబంలో రెండో  పార్టీ

 

. . . రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకే టీఆర్ఎస్ ఎఫెక్ట్

 

 హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరు టిఆర్ఎస్ గా ప్రకటించి సంచలనం సృష్టించింది. తెలంగాణ రాష్ట్ర సమితిని అనుకరిస్తూ టిఆర్ఎస్  పేరును సొంతం చేసుకుంటూ కవిత రాజకీయ పార్టీని ప్రకటించడం కలకలం రేపింది. టిఆర్ఎస్ పార్టీ 2001లో కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధన కోసం ఏర్పడిన విషయం తెలిసింది. తెలంగాణ రాష్ట్ర న్ని సాధించిన పార్టీగా రెండు పర్యాయాలు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసింది. అయితే కెసిఆర్ టిఆర్ఎస్ ను ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని ఫక్తు రాజకీయ పార్టీగా భారత రాష్ట్ర సమితిగా నామకరణం చేశారు. మహారాష్ట్ర తో పాటు ఇతర రాష్ట్రాలకు విస్తరణ కార్యక్రమాలను చేపట్టారు. మహారాష్ట్రలో పార్టీ విస్తరణ చేపట్టి చేరికలను ప్రోత్సహించారు. ఆంధ్రా వైపు అడుగుపెడుతుండగానే రాజకీయ పరిణామాల నేపథ్యంలో దానికి చెక్ పడింది. దానితో తెలంగాణలో టిఆర్ఎస్ కనుమరుగైంది. 2023 లో జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అధికారానికి దూరమైంది. పార్లమెంటులో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును లేకపోవడమే పార్టీ ఓటమికి కారణమని చర్చ కూడా జరిగింది. ఇటీవల కాలంలో బిఆర్ఎస్ స్థానంలో టిఆర్ఎస్ పేరు పెట్టాలని ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇటీవల పార్టీ పాతిక సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోనూ ఇదే  డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈనెల 20న జగిత్యాల జిల్లాలో జరిగిన బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద  సభకు ముందు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టిఆర్ఎస్ పేరు మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి తీసుకువెళ్లక ముందే తెలంగాణలో మరో టిఆర్ఎస్ పార్టీ పుట్టుకురావడం రాజకీయంగా చర్చకు దారితీసింది. కల్వకుంట్ల కుటుంబం నుంచి రెండవ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఎవరికి చేటు అని చర్చ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సమితి గా బిఆర్ఎస్ రూపాంతరం చెందితే కల్వకుంట కవిత స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సేన కూడా ఎన్నికల బరిలో టిఆర్ఎస్ గాని ఉచ్చరించే అవకాశం ఉంది. దానితో టిఆర్ఎస్ పార్టీ ఉనికికే ప్రమాదం పొంచి ఉంది. టిఆర్ఎస్ అన్న పేరును దక్కించుకోవడంతో పాటు కెసిఆర్ సారథ్యంలోని టిఆర్ఎస్ పార్టీలో తనను పార్టీ నుంచి సస్పెన్షన్ చేయించే శక్తులకు కవిత చెక్ పెట్టిందని చర్చ జరుగుతోంది.

 ఆది నుంచి రహస్యమే…

తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ గురైన తర్వాత తాను కొత్త రాజకీయ పార్టీని పెడుతున్నట్టు ప్రకటించి సంచలనం రేపిన విషయం తెలిసిందే. భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెన్షన్ కు ముందు కవిత కెసిఆర్ దగ్గర కీలకంగా ఉన్న హరీష్ రావు సంతోష్ రావు లను టార్గెట్ చేస్తూ  అవినీతి, అక్రమాలపై  వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. ఆ సమయంలో కవిత వెనుక జాతీయ పార్టీలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ఖండించిన కవిత తానే కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోని గత కొంతకాలంగా రాజకీయ పార్టీ ఏర్పాటుకు తీవ్ర కసరత్తు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి ఉత్సవ వేడుకల్లో పాల్గొన్న కవిత ఏప్రిల్ 25న తన రాజకీయ పార్టీ ప్రకటనతో పాటు విధివిధానాలు ఏజెండాను ప్రకటిస్తానని పేర్కొన్నారు. అందులో భాగంగా కవిత రాజకీయ పార్టీ పేరుపై చాలా చర్చలు జరిగాయి. పలు పేర్లను కూడా ప్రస్తావనకు వచ్చాయి. కొన్ని పేర్లను ఇదే కవిత పెట్టబోయే రాజకీయ పార్టీ అంటూ లీకులు కూడా ఇచ్చారు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఊరురా బతుకమ్మలతో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలిగా ప్రజలకు చేరువైన కవిత తెలంగాణ పదాన్ని తన పార్టీకి ముందుగా ఉంచారు. అదేవిధంగా తెలంగాణలో టిఆర్ఎస్ అంటే ప్రజల్లో ఉన్న సెంటిమెంటును గౌరవించడంతోపాటు అదే పేరుతో రాజకీయంగా ఎదగాలని యోజనతోనే టిఆర్ఎస్ పేరు ప్రకటించినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికీ కేసీఆర్ వద్దని ఉండడంతో టిఆర్ఎస్ అని పేరు కోసమే తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరును నామకరణం చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికి కల్వకుంట్ల కుటుంబం నుంచి రెండు టీఆర్ఎస్ పార్టీలు స్థాపించడం జరగబోయే ప్రత్యక్ష ఎన్నికల్లో ఏవిధంగా ప్రభావం ఉంటుందో వేచి చూడాల్సిందే.

మూడు రంగులతో పార్టీ జెండా…

తెలంగాణ రాష్ట్ర సేన రాజకీయ పార్టీగా ప్రకటించిన కల్వకుంట్ల కవిత పార్టీ జెండాను మూడు రంగులతో ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. మీడియా సాక్షిగా పవిత్రమైన పసుపు రంగును బ్యాక్ గ్రౌండ్ గా నీలిరంగులో తెలంగాణను టిఆర్ఎస్ పేరును తెలుపు అక్షరాలతో కూడిన జెండాను ప్రదర్శించారు. పసుపు రంగు , నీలి రంగు జెండాతోపాటు ఏజెండాలను కూడా కవిత ప్రకటించారు. తెలంగాణకు సీఎం కావడమే లక్ష్యంగా తన రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కవిత బహిరంగంగానే ప్రకటించారు. పార్టీ పేరు విధివిధానాలను ప్రకటించడ నేపథ్యంలో ఇతర పార్టీలోని నాయకులను టిఆర్ఎస్ లో చేర్చుకునేందుకు ప్రణాలికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. రాజకీయ పార్టీ పేరు ఖరారైన నేపథ్యంలో తెలంగాణలో తొలిత జరగనున్న జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో టిఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసే అవకాశం ఉంది.

 

More articles

Latest article