27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కేసీఆర్ పాత కేసీఆర్ కాదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కేటీఆర్ కు రాజకీయ పరిజ్ఞానం లేదు

 

. . . రేవంత్ రెడ్డి కర్కోటకుడు

 

. . . టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కవిత సంచలన వ్యాఖ్యలు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

కేసీఆర్ పాత కేసీఆర్ కాదని మారిన మనిషని అన్నారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళయిన మన కలలు సాధ్యం కాలేదని కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పిందని, సామాజిక రథ చక్రం విరిగి ముక్కలైందన్నారు. ఏ తరహాలో పని చేయాలో అలా జరగలేదని చెప్పటానికి బాధగా ఉందన్నారు. ఇసుక దందా మీద ప్రేమతో దళితుల చావులు అయ్యాయని, ఫోన్ మాట్లాడాలంటే భయం. దారుణమైన నిఘా నీడలో మనం బతికామని గుర్తు చేశారు. మనం అనుకున్న తెలంగాణ రాలేదని మీకు చెబుతున్నా,ఆనాడు పరిపాలించిన కుటుంబంలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నానన్నారు. తెలంగాణ సాధించటంలో భాగమైనందుకు నా జన్మ ధన్యమైందన్నారు. నా తప్పులకు భాగస్వామ్యం ఉందన్న దానికి కేవలం క్షమాపణ చెబితే సరిపోదని, ఆ తప్పులను దిద్దుకోవటానికి కష్టపడి పనిచేయాలని అందుకోసమే మేము తెలంగాణ రాష్ట్ర సేన గా మీ ముందుకు వస్తున్నానన్నారు. పోరాటాలకు రాజకీయ శక్తి, అధికారం ఉంటే ఇంకా బాగా పనిచేయవచ్చని,అందుకోసమే ఈ పార్టీ మీ ముందుకు వచ్చిందన్నారు. కేటీఆర్ కు రాజకీయ పరిజ్ఞానం లేదని విమర్శించారు. ఇవ్వాళ రాష్ట్రంలో ఒక కర్కోటకుడి పాలన నడుస్తోందన్నారు. వెలుగుమట్లలో అన్ని పర్మిషన్లు ఉన్నప్పటికీ ఇళ్లను కూలగొడితే బాధతో ఒక గర్భిణీ కి అబార్షన్ అయ్యిందన్నారు.ఆ గర్భిణీ తండ్రి రోదన ఇంకా కళ్ల ముందు మెదులుతోందని అందుకే కర్కోటకుడు, నియంత అంటానన్నారు. రెండు నెలల చిన్నారి చనిపోతే ఇప్పటికీ కూడా కేసు పెటట్టం లేదని, గురుకులాల్లో విషం పెట్టి పిల్లలను చంపితే ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదని, కర్ల రాజేష్ అనే యువకుడిని లాకప్ డెత్ చేస్తే ఇప్పటికీ కేసు పెట్టలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ మీద కచ్చితంగా మనమే పోరాటం చేస్తామని, ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షమని, రెండేళ్ల తర్వాత అధికారంలోకి వస్తామని అన్నారు. కవిత పాంచజన్యం పేరుతో 5 హామీలు ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు, ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఉచిత విద్య, ఏ రోగమైనా సరే.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నింటిలో ఉచిత వైద్యం, వ్యవసాయం రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తామని, యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు ఉపాధి కల్పిస్తామని, సామాజిక న్యాయ తెలంగాణ సాధించడమే లక్ష్యమని కవిత వెల్లడించారు.

More articles

Latest article