25.5 C
Hyderabad

గిరిరాజ్ కళాశాలలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవ కార్యక్రమం

Telangana Language Day Celebrated Grandly at Giriraj College

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  మన మాండలిక భాషే మన ఆత్మ గౌరవం

. . .  ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.రామ్మోహన్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో బుధవారం కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో  ” తెలంగాణ భాషా దినోత్సవ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ…”మన మాండలిక భాషే మన ఆత్మ గౌరవం అని అన్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదువులు కొనసాగడం వల్ల మన మాతృభాష వాడకం తగ్గిపోతుందని, మనం తెలుగు భాషను మరవరాదని అన్నారు. తెలుగు విభాగం అధిపతి డా. రామస్వామి మాట్లాడుతూ భాష కేవలం సంభాషణకే పరిమితం కాదని, అది మన చరిత్రను, అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెబుతుందని, సంస్కృత ప్రభావం లేని, తెలంగాణ యాసనే అసలు సిసలైన తెలుగు భాష అని, తెలంగాణ మాండలికాన్ని సాహిత్యంలో బలంగా వాడి పలుకుబడుల భాషకు ప్రాధాన్య కల్పించిన కాళోజీ సేవను, కృషిని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ భాషకు, యాసకు గౌరవం పెరిగిందని అన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్ రంగరత్నం, టీయూ ఈసి మెంబర్ డా.దండుస్వామి, వినయ్ కుమార్, కె.రంజిత, ప్రతిభ, సుభాషిణి దేవి, రాహుల్, నహీదా బేగం, రమేష్ గౌడ్, అనసూయ, ముత్తెన్న, రామకృష్ణ, భరత్ రాజ్ తెలుగు అధ్యాపకులు డా.శమంత, డా.శ్రీనివాస్, రాజేశ్వర్, గంగాధర్, రాధిక, అర్చన, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Language Day Celebrated Grandly at Giriraj College
Telangana Language Day Celebrated Grandly at Giriraj College

More articles

Latest article