25.4 C
Hyderabad

నాంపల్లికి విద్యుత్ ఉద్యోగుల సన్మానం

Grand Felicitation for Electricity Department Employees

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందూర్, బతుకమ్మ :

మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కోరు కమిటీ మెంబర్ గా రేణికుంట నాంపల్లిని నియామకం కావడంతో బుధవారం నగరంలోని విద్యుత్  డివిజనల్ ఇంజనీరింగ్ కార్యాలయం ఆవరణలో విద్యుత్ ఉద్యోగుల వివిధ యూనియన్లు అసోసియేషన్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాంపల్లి మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆశీస్సులతో కార్యకర్త స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చాను కాబట్టే రాష్ట్రంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్యను బలోపేతం చేస్తూ మాదిగ జాతి తో పాటు అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడతానని అన్నారు. కృష్ణ మాదిగ సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ వారి బాటలో నడుస్తానని తెలిపారు. తనను సన్మానించిన విద్యుత్ సంఘాల నాయకులకు నాంపల్లి కృతజ్ఞతలు తెలిపారు. సన్మానించిన వారిలో 1104 కంపెనీ అధ్యక్షులు రఘునందన్, ఎస్సీ, ఎస్టీ సంఘం నాయకులు గంగారం, శంకర్, నాగరాజు, వివో టి నాయకులు శివాజీ, ఎస్టీ సంఘం నాయకులు చంద్రశేఖర్, వీరాజీ, మోతిలాల్,గంగాధర్, నాగభూషణం, సాయిలు పాల్గొన్నారు.

More articles

Latest article