- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, బతుకమ్మ : కేసీఆర్, జయశంకర్ ఆలోచనలతో పుట్టిన సంస్థ తెలంగాణ జాగృతి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, పఠాన్ చెరు నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు, యువకులు ఎమ్మెల్సీ కవిత సమక్షంలో తెలంగాణ జాగృతి లో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘తెలంగాణ నుంచి ఇద్దరు దార్శనికులు ఒకరు పీవీ నర్సింహా రావు.. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా నివాళులు.. రెండోవారు తెలంగాణ సాధకులు కేసీఆర్. తెలంగాణ జాగృతి 2006 లో మొదలయింది, తెలంగాణ కల్చర్, ఐడెంటిటీ నిలబెట్టాలి అనే ఒకే ఒక ఎజెండా తెలంగాణ జాగృతి ది. సీఎం రేవంత్ రెడ్డి కి బూతులు తప్ప ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలేదు. యూత్ పాలిటిక్స్ కి రావాలి. స్టూడెంట్స్ కి ఏ ప్రాబ్లెమ్ ఉన్నా తెలంగాణ జాగృతి ఫైట్ చేస్తది. ఆడపిల్లకి స్కూటీ ల కోసం అందరం కలిసి ఫైట్ చెయ్యాలి. స్టూడెంట్ సమస్యలు మాట్లాడుతుంటే కాంగ్రెస్ నాయకులకి భయం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ బ్రతికి బట్టకట్టిందే ఆడవాళ్ళ వల్ల అన్నది గుర్తు పెట్టుకోవాలి. ఇందిరా గాంధీ, సోనియా గాంధీ వళ్లనే కాంగ్రెస్ పార్టీ బ్రతికింది. మహిళలను తక్కువ చేసి మాట్లాడుతున్న జగ్గారెడ్డి ని ఆయన భార్య, కూతురే సరి దిద్దాలి. జగ్గారెడ్డి వ్యాఖ్యలే కాంగ్రెస్ పార్టీ స్టాండా అన్నది సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇవ్వాలి. బీజేపీ పార్టీ ఎంపీ.. వకీల్ సాబ్ వంకర టింకరగా మాట్లాడుతున్నారు. బీసీ బిళ్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరనే పెండింగ్ లో ఉన్నది.. ఆ బిల్లును పాస్ చేసి పంపుతారా లేదా అనేది సూటిగా చెప్పాలి.
