నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గత 32 సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ ఎంతోమంది విద్యార్థుల ఉన్నతికి సేవలందించి ఈ నెల 30 న ఉద్యోగ విరమణ పొందబోతున్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల బర్కత్ పుర ప్రధానోపాధ్యాయులు, పి ఆర్ టి యు తెలంగాణ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సోడి కృపాల్ సింగ్ ను శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి పి.అశోక్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృపాల్ సింగ్ చేసిన సేవలను విద్యాశాఖ శాశ్వతంగా గుర్తుంచుకుంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.