ములుగు, బతుకమ్మ : ములుగు జిల్లాలో ఆదివాసి గిరిజన వ్యవసాయ క్షేత్రంలో మొక్కజొన్న విత్తన పంట వైఫల్యం పై మంగళవారం తెలంగాణ వ్యవసాయ, సంక్షేమ కమిషన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్ అన్వేష్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, కమిషన్ సభ్యులు, జిల్లా కలెక్టర్ దివాకర్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

