28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

నూతన డీజీపీ ని కలిసిన పోచారం భాస్కర్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సి. వి. ఆనంద్ ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖను సమర్థవంతంగా ముందుకు నడిపించాలని ఆకాంక్షిస్తూ, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన విజయవంతం కావాలని పోచారం భాస్కర్ రెడ్డి అభిలషించారు. డీజీపీగా నియమితులైన అనంతరం పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు సి.వి. ఆనంద్ ని కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు.

More articles

Latest article