నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్. సింధుశర్మ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, స్పెషల్ పార్టీ సిబ్బంది రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్ బిలోలి గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు పేకాటరాయుళ్లు పట్టుబడగా వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనాలను, నాలుగు సెల్ ఫోన్లు, రూ.31,100 నగదు స్వాధీనం చేసుకుని, తదుపరి చర్య నిమిత్తం రెంజల్ పి.ఎస్ ఎస్సై కు అప్పజెప్పినట్లు తెలిపారు.,
